సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణానికి సమీపంలో ఉన్న దూరజ్ పల్లి వద్ద ఓ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలతో ఆ ప్రాంతమంతా కమ్ముకున్నాయి. ఫ్యాక్టరీలో అన్ని ప్లాస్టిక్ వస్తువులు కావడంతో పెద్ద ఎత్తున్న మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో రూ.కోటిన్నర విలువైన ఆస్తి నష్టం జరిగింది. ఫ్యాక్టరీలోని ప్లాస్టిక్ గ్లాసులు తయారీకి ఉపయోగించే సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి.
సూర్యాపేట మున్సిపల్ పరిధిలో దురాజ్ పల్లి వద్ద జయశంకర్ పాలిమర్స్ ప్లాస్టిక్ గ్లాస్ ల తయారీ గోదాం లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి గోదాం పూర్తిగా దగ్ధం అయింది. ఘటనా స్థలానికి చేరుకొన్న2 ఫైర్ ఇంజిన్లు మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు.
గోదాంలో 40 టన్నుల విలువైన సామాగ్రి ఉండగా తయారీ మిషన్లు మొత్తం పూర్తిగా కాలిపోయాయని సుమారు రూ.కోటి ప్లాస్టిక్ సామాగ్రి దగ్ధం కాగా గోదాం షెడ్ పూర్తిగా కాలిపోయింది. మరో రూ.40 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని మొత్తం రూ.కోటిన్నర రూపాయలునష్టం వాటిల్లిందని గోదాం యజమాని తెలిపారు.బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.